అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ మార్చి 18 - ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభం గా ఉన్న మీడియాపై ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ వి6 ఛానల్ తెలుగు దినపత్రికలపై విధించిన నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు రాస్తారోకో ను నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ భరణి బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మందుముల నర్సింగరావు స్మారక జర్నలిస్ట్ అవార్డు గ్రహీత దొడ్డ ప్రభుదాస్ కొంగూరి రమణారావు మోత్కూరు చిన్న వెంకటేశ్వర్లు శేషగిరి పరుచూరి రవీంద్రబాబు ఋషి కుమార్ కోడి రెక్కల వెంకటేశ్వర్లు దారిశేట్టి శ్రీనివాసరావు దొడ్డి హరినాగవర్మ మండలోజు వీరాచారి గోగికార్ రామలక్ష్మణ్ సంతోష్ వర్మ బండారి భరణి బొబ్బిళ్ళపాటి రవి కిరణ్ కొండా కౌశిక్ సిరిపురపు నాగేశ్వరరావు బోరా అప్పారావు నాంపల్లి సాగర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily