అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ మార్చి 18(అక్షరం న్యూస్) కంటి లో వత్తిడి వల్ల గ్లాకోమా వ్యాధి అనే వస్తుందని కూచకుళ్ళ రాంచంద్రారెడ్డి నేత్ర వైద్య కేంద్రం డాక్టర్ దీపికా అన్నారు శనివారం తెల్కపల్లి మండల కేంద్రంలో ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్లాకోమా అనే వ్యాధి ప్రధానంగా చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు ప్రతి వ్యక్తి విధి గా ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆమె తెలిపారు. ఈ వ్యాధి గాయాల వల్ల స్టెరాయిడ్స్ వాడకము వల్ల గ్లాకోమా అనే వ్యాధి సోకే అవకాశం ఉందని దీని పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో కంటి వైద్య సిబ్బంది దేవి చందర్ రావు . రాజు .వెంకటయ్య ఆంజనేయులు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలస్వామి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily