అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/ తెల్కపల్లి/ మార్చి 18(అక్షరం న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ చౌరస్తాలో గల రెయిన్ బో క్లినిక్లో ఈనెల 19న ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఇ ఎన్ టి (చెవి, ముక్కు, గొంతు)సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ శిబిరంలో అన్ని వయస్సుల వారికి ముక్కు, చెవి, గొంతు సంబంధించిన సమస్యలకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా రూ.1500ల విలువ గల ఓపీ, ఎండో స్కోప్, వినికిడి పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. శిబిరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్జరీ ఖర్చులో 10 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మందులపై 15 శాతం రాయితీ అందించనున్నట్లు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
.
Aksharam Telugu Daily