అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ మార్చి18 (అక్షరం న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శ్రీ సార్థా సప్త జేష్ట మాత సమేత శనేశ్వర స్వామికి ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి శనివారంనాడు ఉండటంతో స్వామి వారికి ప్రత్యేకంగా తిలా తైలా అభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. భక్తుల జన్మ రిత్యా, గోచార రీత్యా గ్రహదోషాలు తొలగుటకు శనేశ్వర స్వామికి తిల తైల అభిషేకాలు, బ్రహ్మ సూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకపూజలు, ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.అనంతరం ఏకాదశి ఉండడంతో మహా గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిద ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్ల వారు జమున నుండి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు,అష్టోత్తర, అర్చనలు పూజలు చేశారు. భక్తులు బ్రహ్మ సూత్రం గల పరమ శివునికి రుద్రభిషేకాలు, అర్చనలు పుజలుచేసి దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ గోపాలరావు, కమిటీ సభ్యులు,వీరాశేకరాచారి, సర్పంచ్ సుదర్శన్ గౌడ్,ఆలయఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమ్మయ్య,జయంత్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily