అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/పరకాల : హనుమకొండ /పరకాల/ మార్చి 18. అక్షరం న్యూస్ వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సీపీఆర్ పై అవగాహన సదస్సులో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తో కలిసి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీఆర్ పని తీరును వైద్య అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా సీపీఆర్ చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కార్డియాక్ అరెస్టులతో చాలా మంది యువకులు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణస్తున్నారని, ఇలాంటి మరణాలు ఇక ముందు జరగకుండా వారిని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సీపీఆర్ తో ఒక్కరి ప్రాణం కాపాడిన వారికి వేల కట్టలేని సహాయం చేసినట్లే నని అన్నారు. ఒకప్పుడు చేసే పనులతో శారీరక శ్రమ కారణంగా ఆరోగ్యంగా ఉండేవాళ్లమని, ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, ఆటలకు దూరమై శారీరక శ్రమ అనేది లేకుండా పోయిందని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తతో ఉండాలని సూచించారు. నేటి రోజుల్లో ఎలాంటి అలవాట్లు లేని చిన్నపిల్లలకు కార్డియాక్ అరెస్టుకు గురవుతున్నారని, కరోనా తర్వాత మన శరీరంలో కొన్ని మార్పులు జరిగాయని వెల్లడించారు. కనుక ప్రతీ ఒక్కరూ గుండె సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండడంతో పాటు సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, మేయర్ గుండు సుధారాణి , కూడా చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్ డిఎం అండ్ హెచ్ వో వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily