అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : - టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి రాజన్న సిరిసిల్ల స్టాపర్/ మార్చి 18 (అక్షరం న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టిటియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి మాట్లాడుతూ ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నదున ఈ- కూబెర్ లో పెండింగ్ లో వున్న డియే ఏరియర్స్, మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు మరియు ఉద్యోగ, ఉపాద్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు,ప్రభుత్వ బీమా చెల్లింపులను మరియు ప్రభుత్వ జీవిత బీమా చెల్లింపులను వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు..వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైన ఒకటో తేదీన జీతాలు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని టిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డిమళ్ల మాణిక్యం,జిల్లా ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి,ఏనుగుల పోచయ్య,గంగరపు చిరంజీవి, మడికంటి మల్లేశం,రాజు,అమరేందర్ లు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily