అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / సూర్యాపేట్/నేరేడుచర్ల : - కర్రీ సతీష్ రెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు... సూర్యాపేట/నేరేడుచర్ల/మార్చి 18(అక్షరం న్యూస్):- నేరేడుచర్ల పట్టణ కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం లో పట్టణ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రాష్ట్రా ప్రభుత్వం వేసినటువంటి రేషన్ డీలర్లు పట్టణం లో అర్హులైన వారికీ కాకుండా కేవలం అధికార పార్టీ కి చెందిన వారికి రావడమే దీనికి నిదర్శనం అని ఆలా అయితే డైరెక్ట్ గా ఎవరు అప్లై చేసుకోవద్దు అని కేవలం అధికార పార్టీ వాళ్ళు మాత్రమే దేనికైనా అప్లై చేసుకోవాలి అని వారే అర్హులు అని అన్ని ప్రభుత్వ ఆఫిస్ లలో బోర్డులు ఏర్పాటు చేయాలి అని మొన్నటికి మొన్న మున్సిపాలిటీలో మైనారిటీ లోన్లు విషయం లో కూడా ఎంతో మంది అప్లై చేసుకున్న అవి ముందే కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ, తమ వాళ్ళకే అని బహిరంగగా చెప్పుకోవడం ఇవ్వని చూస్తుంటే కేవలం ప్రభత్వం నుండి వచ్చే పథకాలు పేదలకు, అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే చెందడం చాలా బాధాకరం అని ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని వారి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం చెబుతారు అని పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమం లో తక్కెల్ల నాగార్జున, పోలె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily