Sunday, 02 April 2023 01:40:48 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

బిజెపి పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగినాయి

డిహెచ్ పీఎస్ రాష్ట్ర నాయకులు... మారుపాక అనిల్ కుమార్

Date : 16 March 2023 09:04 PM Views : 77

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / బెల్లంపల్లి : డిహెచ్ పీఎస్ రాష్ట్ర నాయకులు..... మారుపాక అనిల్ కుమార్.... బెల్లంపల్లి,మార్చి 16 ( అక్షరం న్యూస్) ఆర్ఎస్ఎస్ కను సన్నల్లో గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న బిజెపి పాలనలో దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయి అని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పీ ఎస్) రాష్ట్ర నాయకులు మారుపాక అనిల్ కుమార్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి మంచిర్యల జిల్లా విస్తృత స్థాయి సమావేశం.డి ఆర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లడుతూ 2014లో 40,072 దాడులు జరిగితే 2021 సంవత్సరం నాటికి అవి 50,900 సంఘటనలకు పెరిగాయి బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులపైన దాడులు దౌర్జన్యాలు 300 రెట్లు పెరిగాయి. మతోన్మాద శక్తులు విద్వేషాలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా పేద ప్రజల మధ్యన ఐక్యతను విచ్చిన్నం చేస్తున్నాయి. దళిత గిరిజనులు దాడులు దౌర్జన్యాలనుండి ఎంతోకొంత ఉపశమనం పొందే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిర్వీర్యం చేయాలని కేంద్ర బిజెపి సర్కార్ ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా దళితులు వీధుల్లోకొచ్చి దశల వారి ఆందోళన చేపట్టగా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ను వెనక్కి తీసుకుంది దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల ఈ దాడి ఈ దాడులు రెట్టింపు అవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లను రద్దుచేస్తూ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుంది రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి మనుస్మృతిని దేశ పవిత్ర గ్రంథం గా ప్రవేశపెట్టాలని ఆర్ఎస్ఎస్ కుటిల యత్నాలు చేస్తుంది. వీటిని తిప్పి కొట్టాల్సిన గురుతర బాధ్యత నేటి యువతరం పైన ఉంది 70శాతంకు పైగా పెరిగిన ప్రైవేటు రంగంలో ఎటువంటి రిజర్వేషన్లు లేకపోవడం వల్ల దళిత గిరిజనులు ఆధునిక విద్యను ఉపాధిని అందిపుచ్చుకోలేకపోతున్నారు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మెజారిటీ పేదలకు సామాజికన్యాయం దక్కుతుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా 20 శాతం జనాభా ఉన్న దళితులకు బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలి కానీ పాలకులు నీతి అయోగ్ ప్రణాళికా సంఘం పేరిట ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మరుగున పరుస్తుంది. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి అయన కేంద్రం ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి ప్రథమ రాష్ట్ర మహాసభలు 2023 మార్చి 31న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మహాసభలు ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా బిజెపి ఆలంబిస్తున్న దళిత వ్యక్తుల విధానాల పట్ల చర్చించి భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకొని పోరాటాలకు సిద్ధమవుతామని అనిల్ కుమార్ తెలిపారు .*ఈ కార్య క్రమం జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, కార్యవర్గ సభ్యులు మారపల్లి రవి, గుండ చంద్రమాణిక్యం, నక్క వెంకటస్వామి అక్కపెళ్లి బాబు, నర్సింగరావు, జాడి పోచన్న మామిడి గోపి బండారు శంకర్ తొగరు సత్యనారాయణ కామెర దుర్గయ్య, దాసరి శ్రీనివాస్,ఎల్తురు శంకర్ రత్నం రాజం సింగారపు భారత్, గుండా ప్రశాంత్ ఆడెపు రాజమోగిలి తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :