Sunday, 02 April 2023 01:11:59 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది

మాజీ ఎమ్మెల్యే మొలుగూరు బిక్షపతి.

Date : 16 March 2023 02:13 PM Views : 481

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / హన్మకొండ/పరకాల : చల్లని ఓడించే దాకా నిద్రపోయేది లేదు. మాజీ ఎమ్మెల్యే మొలుగూరు బిక్షపతి. హనుమకొండ /పరకాల /మార్చి 16.అక్షరం న్యూస్. నడికూడా మండలం కంటాత్మకూర్ గ్రామంలో గురువారం రోజు శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఎరుకల దివాకర్ ఆధ్వర్యంలో బూత్ సాయి శక్తిని పెంపొందినందుకు బూత్ కమిటీలను బలోపేతం చేసేందుకు గ్రామాల్లో బూత్ కమిటీలను వేయడం జరిగింది. ఈ సమావేశానికి పరకాల క్లస్టర్ ఇంచార్జ్, పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద కార్నర్స్ మీటింగ్స్ నిర్వహించడం జరిగిందని, అనుకున్న దానికన్నా ఎక్కువని కార్నర్ మీటింగ్లు విజయవంతమైనయని ఈ సందర్భంగా తెలిపారు. పరకాల నియోజకవర్గం లోని ప్రతి గ్రామ గ్రామాన బిజెపి శక్తి కేంద్రాలు బూత్ కమిటీల నియమకాలు జరిగాయని వారు బిజెపి అధికారంలో తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేస్తే కల్వకుంట్ల కంపెనీ అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగులు, యువత తెలంగాణలో సంతోషంగా లేరని గుర్తు చేశారు. చివరకు బిఆర్ఎస్ లో గెలుపొందిన సొంత పార్టీ సర్పంచులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటూ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మ రెడ్డి చంద్రగిరి గుట్టల మీద పేద ప్రజల భూమి తక్కువ ధరకు కొని రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరుస్తున్న బడా కాంట్రాక్టర్ అని, పరకాలలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయిన కానీ చల్ల ధర్మారెడ్డి అంతా అవినీతిపరంగా సంపాదించిన ఎమ్మెల్యే ఎవరు లేరని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో చూపెట్టిన ఆస్తులు ఎంత. .? ఇప్పుడు సంపాదించిన ఆస్తులు ఎంతో పరకాల నియోజకవర్గ ప్రజలకు తెలుపాలని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సీసీ రోడ్లు, రైతు వేదికలు, మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిని తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని డబ్బా కొట్టుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎద్దేవ చేశారు. పరకాల నియోజకవర్గం లో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూములు, దళిత బందులు, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో గద్దె ఎక్కడం ఖాయమని పరకాల నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే గెలవడం ఖాయమని వాగ్దానం చేశారు. తాను ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించానని, పరకాల ఎమ్మెల్యే ను ఓడించే వరకు నిద్రపోయేది లేదని హెచ్చరించారు. పరకాల ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన తర్వాతనే పరకాలలో ఎన్నికల సమయంలో ఓట్లు అడిగే నైతిక బాధ్యత ఉంటుందని, ప్రజలు బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరకాల కౌన్సిలర్ ఆర్పీ జయంతిలాల్, బిజెపి నాయకులు బండి రాజేందర్, బండ్ల వేణు, మేడిపల్లి లక్ష్మణ్, పల్లెబోయిన రాజు, దండు సురేష్, మారబోయిన శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :