అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / పెద్దపల్లి/గోదావరిఖని : గులాభీ జెండాకు గుండే బలం సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బి.ఆర్.ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. కార్యకర్తలంతా కాంగ్రెస్,బిజెపి పార్టీలు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారాన్ని తిప్పికొట్టాలి. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్. గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 14/అక్షరం న్యూస్: రామగుండం నియోజకవర్గం లోని గులాబీ సైనికులంతా బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రామగుండం లో గులాబీ జెండా రెపరెపలాడాలనీ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో రామగుండం నియోజకవర్గం బి.ఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంల తేదీలను ఆత్మీయ సమ్మేళనం సమన్వయకర్తలను ఎమ్మెల్యే ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ జేండా కు గుండె బలం సిఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ అని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగాతెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.రామగుండం నియోజక వర్గంలోని మండలాలు పరిధిలోని పట్టణాల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ పలకరింపు కై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ సైనికులతో ఆత్మీయ సమ్మేళనం కి శ్రీకారం చుట్టారని అన్నారు. సీఎం కేసీఆర్,కేటీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగాఆవిర్భవించింది అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకువెళ్లాలని చెప్పారు.టిఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్,బిజేపి పార్టీ చేస్తున్న దుర్మార్గమైన ప్రచారాలను తిప్పికోట్టాలన్నారు.మనందరి లక్ష్యం రామగుండంలో గులాబీ జేండా ఎగరడమేనని అన్నారు.19 వ తేదినా 8 వ కాలనీ పట్టణ పరిధిలో 21న 5 ఇంక్లైన్ పట్టణ పరిధిలో జవహర్‌లాల్ గడ్దమీద ఫంక్షన్ హాల్లో,లక్ష్మి నగర్ పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్,24 న పాలకుర్తి మండలం,26 ఎన్టీపీసి పట్టణం పరిధి టివి గార్డెన్స్ లో,27 గంగ నగర్ స్వాగత్ గార్డెన్స్,28వ తేదిన అంతర్గాం మండలంలో,29న ఎల్బీనగర్ పట్టణం ఎస్వీ హాల్ లో,31 గౌతమినగర్ పట్టణ పరిధిలో మహలక్ష్మి ఫంక్షన్ హాల్లో,మే 1వ తేదిన హనుమాన్ నగర్ పట్టణ పరిధిలో,మే 2వ తేదిన రామగుండం లో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నమని అన్నారు. అంతర్గాం మండల పరిధిలో అముల నారాయణ, కరివేద శ్రీనివాస్ రెడ్డి,కోల సంతోష్ గౌఢ్,పాలకుర్తి మండలానికి ఎర్రం స్వామి,అల్లం రాజయ్య,అదర్ సండే సమ్మారావు,రామగుండం పట్టణానికి నడిపెల్లి అభిషేక్ రావు,దీటీ బాలరాజ్,సమ్మి రెడ్డి,ఎన్టీపీసీకి ఎన్వి రమణ రెడ్డి,కుమ్మరి శ్రీనివాస్,బుర్ర శంకర్ గౌడ్, గంగ నగర్ పట్టణానికి జవిద్,పీచర శ్రీనివాస్,పిల్లి రమేష్,హనుమన్ నగర్ బంగి అనిల్ కుమార్,వంగ శ్రీనివాస్,చిప్ప రాజేశం,5 ఇంక్లైన్ పట్టణానికి శంకర్ గౌడ్,నారాయణదాసు మారుతి,చెరుకు బుచ్చిరెడ్డి, తిలక్ నగర్ పాముకుంట్ల భాస్కర్,జే.వి.రాజు,కోమ్ము వేణు,ఎల్బీనగర్ రామస్వామి,విజయరెడ్డి,రవి, లక్ష్మినగర్ తానిపర్తి గోపాల్ రావు,మురళీధర్ రావు, పి.ఎస్ అమరేందర్,గౌతమినగర్ శంకర్ గౌడ్, పి.టి. స్వామి,మెహిద్ సన్నీ,8 వ కాలనీ సాగంటి శంకర్, మేకల సమ్మయ్య యాదవ్,జనగామ నర్సయ్య లను బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల సమన్వకర్తలు వ్యవహరిస్తరని ఎమ్మెల్యే తెలిపారు.
.
Aksharam Telugu Daily