Sunday, 02 April 2023 01:25:15 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన

చెన్నూరు ఎమ్మెల్యే-విప్ బాల్క సుమన్ ప్రకటన

Date : 14 March 2023 08:51 AM Views : 171

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / మంచిర్యాల జిల్లా : ---- 200 కోట్లతో అనేక సంక్షేమ అభివృద్ధి పనులకు శంకుస్థాపన- ప్రారంభోత్సవాలు --- భారీ సంఖ్యలో ప్రజలు,బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,యువ నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు చేరుకొని విజయవంతం చేయాలి --- చెన్నూరు ఎమ్మెల్యే-విప్ బాల్క సుమన్ ప్రకటన మంచిర్యాలబ్యూరో,మార్చి14, అక్షరం న్యూస్: చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో పలు సంక్షేమ ఇంకా అభివృద్ధి పనుల శంకుస్థాపన-ప్రారంభోత్సవాలతో పాటు చెన్నూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు నియోజకవర్గంలో ఈనెల15న పర్యటిస్తున్నట్లు ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి పర్యటన వివరాలు విడుదల చేసిన సందర్భంగా అక్కడి ఏర్పాట్లను కూడా చేశామన్నారు.ఆ కార్యక్రమాలలో జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత,ఎమ్మెల్సీ దండే విఠల్,జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్,జిల్లా కలెక్టర్,అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు.ఆ నేపథ్యంలో మంత్రి యొక్క పర్యటన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. దాంట్లో చూస్తే...జైపూర్ మండలం ఇందారం (ఐకేఓసిపి)వద్ద 37.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం.జైపూర్ మండలం.. ఇందారం గ్రామం నుండి రామారావ్ పేట్ గ్రామం వరకు 2.80 కోట్ల నిధులతో నిర్మించిన చెరువు కట్ట అభివృద్ధితో పాటు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం. జైపూర్ మండలం, ఇందారం గ్రామంలో 4.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులతో పాటు గ్రామ సుందరీకరణ పనులకు శంకుస్థాపన,జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం వద్ద ఈదుల వాగుపై 3 కోట్ల నిధులతో నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన.జైపూర్ మండల కేంద్రంలో 2.30 కోట్ల నిధులతో కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన,జైపూర్ ఇంకా భీమారం మండల కేంద్రాలలో 5.80 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం.జోడువాగుల (వై జంక్షన్) వద్ద 2 కోట్లతో 250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అర్బన్ ఎకో పార్క్ ప్రారంభోత్సవం.చెన్నూరు పట్టణంలో 21.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ దవాఖానకు శంకుస్థాపన.చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న “చెన్నూర్ బస్ డిపో” నిర్మాణానికి శంకుస్థాపన, చెన్నూరు పట్టణ నడిబొడ్డున ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిహెచ్ సి సెంటర్ యందు అదనంగా 2.97 కోట్లతో పలు పనులకు శంకుస్థాపన. చెన్నూరు పట్టణంలో 2.65 కోట్ల నిధులతో 6.34 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవం మరియు 1.70 కోట్లతో స్టేడియంలోని పలు పనులకు శంకుస్థాపన.చెన్నూరు పట్టణంలో మూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన కుమ్మరి కుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.చెన్నూరు పట్టణంలో 18 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన నాలుగు లైన్ల ప్రధాన రహదారి మరియు సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం.చెన్నూరు పట్టణం నడిబొడ్డున 2.50 కోట్ల నిధులతో 2 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన కెసిఆర్ పార్క్ ప్రారంభోత్సవం.చెన్నూరు పట్టణంలో 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.చెన్నూరు పట్టణంలో 1.50 ఓట్లతో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డ్ ప్రారంభోత్సవం ఎఫ్ ఎస్ టి పి శంకుస్థాపన.చెన్నూరు పట్టణంలో 7.20 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్- నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవం.చెన్నూరు పట్టణంలో 1.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సమ్మక్క - సారలమ్మ మహిళా భవనానికి శంకుస్థాపన.చెన్నూరు పట్టణంలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే పిఎసిఎస్ భవనానికి శంకుస్థాపన,తొలి విడతలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లోని 77 గ్రామపంచాయతీలలో 13.86 కోట్ల నిధులతో 77 సమ్మక్క సారలమ్మ మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన.చెన్నూరు నియోజకవర్గం లోని 100 గ్రామపంచాయతీలలో 4 కోట్ల రూపాయలతో 100 లైబ్రరీలకు శంకుస్థాపన.చెన్నూరు పట్టణంలో 17.52 కోట్ల నిధులతో 99.98 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఇంకా 10 నీటి ట్యాంకుల నిర్మాణాలతో 7629 గృహాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభోత్సవం చేస్తారు.అనంతరం చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో చెన్నూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ సభ ఉంటుంది.దాంతో 17,899 మంది లబ్ధిదారులకు 4.79 కోట్ల అభయహస్తం నిధుల విడుదల, మరియు 24,440 మంది లబ్ధిదారులకు 3.36 కోట్ల విలువగల చెక్కుల పంపిణీ.2016 నుండి 2021 వరకు 38,556 మంది బీడీ కార్మికులకు 18.11 కోట్ల విలువగల చెక్కుల పంపిణీ.చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన,చెన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాకవి శిరోమణి శ్రీ వానమామలై వరదాచార్యులు వారి విగ్రహ ప్రతిష్టాపన,సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధి కొరకు కృషి చేసిన మహాత్ములు మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఉంటుందని ప్రకటించారు.ఆ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు,నాయకులు,ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో చేరుకొని విజయవంతం చేయగలని కోరారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :