అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : -జాతీయ స్థాయిలో నాగర్ కర్నూల్ క్రీడాకారుల ప్రతిభ -అభినందించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ---------------------------------------------- నాగర్ కర్నూల్ జిల్లా/ తెల్కపల్లి/ మార్చి 13 (అక్షరం న్యూస్) ఈనెల 10, 11, 12 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా అజ్జరకాడులోని మహాత్మా గాంధీ అథ్లెటిక్స్ ప్రధాన స్టేడియంలో నిర్వహించిన 18వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షప్ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు రెండు బంగారు పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.విజేందర్ యాదవ్, డాక్టర్ సొలపోగుల స్వాములు తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ నుంచి 18 సంవత్సరాల బాలికల విభాగంలో 1000 మీటర్ల స్పిరింట్స్ మేడలెయ్ ఈవెంట్లో చుక్క శైలజ, మాల శృతి, సాయి సంగీత, సింధులు బంగారు పతకాలు సాధించగా అందులో చుక్క శైలజ, మాల శృతి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందినవారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులు, కోచ్ పరశురాంను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొలపోగుల స్వాములు, వైస్ ప్రెసిడెంట్లు లావణ్య రెడ్డి, లక్ష్మి, బిక్షపతి యాదవ్, కోశాధికారి విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు పరశురాం, అంజయ్య, కొర్ర రాములు, సభ్యులు శివ, శ్రీకాంత్, శేఖర్, హైమావతి, విష్ణు, క్రీడాకారుల తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, అభినందించారు.
.
Aksharam Telugu Daily