అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / హన్మకొండ/పరకాల : తెలంగాణ ప్రజలు తరమక ముందే క్షమాపణ చెప్పు. నడికుడ మండల అధ్యక్షుడు చందు. హనుమకొండ/ పరకాల/ మార్చి 12. అక్షరం న్యూస్. తెలంగాణ ఆడబిడ్డను అవమానపరిచిన బండి సంజయ్ జర జాగ్రత్త అని నడికుడ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు దూరిశెట్టి చంద్రమౌళి అన్నారు. ఆయన మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఒక మహిళను ఎలా మాట్లాడాలో తెలవని వ్యక్తి అధ్యక్షుడుగా ఉండడం బిజెపికి అవమానకరమని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ ఉద్యమంలో మహిళలను జాగృతం చేసిన ఘనత తెలవని మూర్ఖ బండి సంజయ్ ఆమెకు ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని లేకుంటే తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily