అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/ తెల్కపల్లి/ మార్చి 12(అక్షరం న్యూస్) తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిలుక శేఖర్ రెడ్డి(45) తెలకపల్లి గ్రామంలోని తన స్వగృహములో ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా మండల పాత్రికేయ సోదరులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు ఆయన మృతదేహం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నెహ్రూ చౌరస్తా లో శేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సీనియర్ పాత్రికేయుని మృతితో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు జిలకర శంకర్, కొండ కింది మాధవరెడ్డి, అవుట వెంకటస్వామి, గుండురు శ్యాము, బాలరాజు మండల పాత్రికేయ సోదరులు భరత్,ఆంజనేయులు గౌడు, బాబయ్య,చంద్రయ్య, విజయ్ గౌడు,సాయి, మల్లేష్ బాబు, వెంకటయ్య పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily