అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / హన్మకొండ/పరకాల : హనుమకొండ/ పరకాల /మార్చి 11. అక్షరం న్యూస్. తెలంగాణ తెలుగింటి ఆడబిడ్డను అవమానపరిచే విధంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పరకాల బి ఆర్ ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ కూడలి లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ తెలంగాణ తెలుగింటి ఆడబిడ్డను అవమాన పరుస్తారా అంటూ మహిళలందరూ కలిసి చెప్పులతో దిష్టిబొమ్మను కొట్టడం జరిగింది. ఖబర్దార్ బండి సంజయ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకొని ఎమ్మెల్సీ కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనియెడలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన మహిళల చేతిలో దేహశుద్ధి తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం ర్యాలీగా పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,మహిళా పట్టణ అధ్యక్షురాలు గంట కళావతి, ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి,పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి. మాదారం సొసైటీ చైర్మన్ లింగమూర్తి .కౌన్సిలర్లు ఏకు రాజు, దామర మొగిలి, మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్,నల్లెల్ల జ్యోతి అనిల్,మడికొండ సంపత్.మహిళ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily