అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మార్చి 09 (అక్షరం న్యూస్) ఓదెల మండల ప్రెస్ క్లబ్ పోత్కపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పని సుదర్శన్ మాట్లాడుతూ ఇటీవల రామగుండం పారి శ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్టిపిసి బూడిద అక్రమ రవాణాపై వార్త పత్రికలో మంగళవారం ఎన్టిపిసి బూడిద అక్రమ రవాణా అనే వార్త కథనాన్ని ప్రచురించడంతో ఈ వార్త రాసిన గోదావరిఖని వార్త పత్రిక విలేఖరి నాయిని మదనయ్యకు అక్రమార్కులు బెదిరింపు కాల్స్ చేయడం దుర్మార్గమైన చర్య అని మీకు ఏదైనా పర్మిషన్ ఉంటే రూల్ ప్రకారం మీరు తరలిస్తున్న బూడిదను న్యాయపరమైంది అయితే మీ దగ్గర ఉన్న సమాచారాన్ని అదే విలేకరుల సమావేశం నిర్వహించి మాకు బూడిద తరలించడానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయని ఎందుకు చూపించడం లేదు ఎందుకంటే అది అక్రమ రవాణా కనక మీరు అది రాసిన వార్త విలేకరిని ఫోన్ ద్వారా బెదిరించడం ఇది చాలా దుర్మార్గమని నిజమైన వార్తలను రాస్తే ఆ విలేఖరి పై లేనిపోని అసత్య ఆరోపణలు చేయడం కాల్ చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసం అని అసత్య ఆరోపణలు మానుకోవాలని అన్నారు ఓదెల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు చెరుకు శంకరయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై అసత్య ఆరోపణలు చేయడం అలవాటైపోయిందని ఒక వార్త పెడితే తనకు డబ్బులు ఇవ్వలేదని తనకు ఏదో ఇవ్వలేదని అందుకనే వార్త పెట్టాడని అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు కొంతమంది చేసిన తప్పులపై వార్త రాస్తే ఆ జర్నలిస్ట్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జర్నలిస్టులకు వెయ్యి కళ్ళు అన్ని సాధించి శోధించి మాత్రమే వార్తను రాస్తారు అంతేగాని ఎవరు చెప్తే వారిదే వార్త పెట్టడం లేదని దీని సదరు వ్యక్తులు గమనించి ఇకనుండి జర్నలిస్టులపై అసత్య ఆరోపణలు మానుకోవాలని బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పని సుదర్శన్ ఓదెల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు చెరుకు శంకర్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి వంగ మహేష్ రాచర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily