అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ మార్చి 6(అక్షరం న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో 7వ తరగతి చదువుతున్న నాగిల్ల నికిత( 12) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది స్థానిక పోలీసులు ,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నికిత పదరా మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన బుచ్చి రాములు కుమార్తె. నికిత కు తోటి విద్యార్థులతో స్వల్ప ఘర్షణ జరిగినట్టు తెలిపారు. విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప ఘర్షణను ఉపాధ్యాయులు సమన్వయం చేసి ఇద్దరు విద్యార్థుల మధ్య సఖ్యతను కుదిరించారు. అయినప్పటికీ కొంత సమయం తర్వాత ఎవరూ లేని సమయంలో విద్యార్థిని నికిత తరగతి గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు .కొంత సమయం తర్వాత విద్యార్థులు వెళ్లి చూడడంతో ఉరివేసుకొని ఉండటం గమనించి తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు .సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనపై అమ్రాబాద్ ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
.
Aksharam Telugu Daily