అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ జిల్లా/ గార్ల/ మార్చి 6 /అక్షరం న్యూస్:- చిన్నపిల్లలను అశ్రద్ధగా ఒంటరిగా వదిలేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడడం జరిగినది. వివరాలకు వెళ్తే గార్ల మండలం చవిటి తండా లో ప్రమాదవశాత్తు నీటి (హౌస్) సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం చవిటి తండాలో చోటు చేసుకుంది. స్థానిక గార్ల ఎస్సై బి. వెంకన్న, తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధి, శేరిపురం పంచాయతీ, చవిటి తండాకు, చెందిన గూగులోత్ వీరన్న, బేబీల, దంపతులకు చెందిన కుమార్ బాబు,(4) సం, కలిగిన బాలుడు నివాసం వద్ద తల్లిదండ్రులు లేని సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటి సంపులో జారిపడి మృతి చెందినట్లు గార్ల ఎస్ఐ తెలిపారు. తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily