Sunday, 02 April 2023 12:43:07 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

సీఎం కేసీఆర్,మంత్రి కేటిఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

Date : 06 March 2023 05:33 PM Views : 178

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / పెద్దపల్లి/గోదావరిఖని : -రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 6/అక్షరం న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన నిధులతో పట్టణ ప్రగతిని ఏర్పాటు చేసి పట్టణాల్లో మౌలిక వసతులను, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మున్సిపల్, సింగరేణి,ఎలక్ట్రిసిటీ విభాగాల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేక నిధులు పట్టణ ప్రగతి,సీఎం గ్రాంట్ ప్లాంట్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్ల కాంట్రాక్టర్ పనులు త్వరగతిన చేపట్టాలన్నారు. సింగరేణి ఎలక్ట్రీకల్ విభాగం పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయాకుడన్నారు.ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో చేపట్టే చేపడుతున్న పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు.కాగా గతంలో ఇంటింటి పర్యటన లో భాగంగా చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలు తమ ఇళ్లపై వేలాడుతున్న కరెంటు తీగలు సమస్యను వివరించగా,ప్రత్యక్షంగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చేశానని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తూ,ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు. మున్సిపల్ ఆఫీస్ నుండి 5 ఇంక్లైన్ వరకు రోడ్ నిర్మాణం,సింగరేణి,ఎన్పీడీసీఎల్ వారు రోడ్ సైడ్ ఫోల్స్ తీసివేయాలన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి జిఎం ఆఫీస్ వరకు (40 ఫీట్ల) రోడ్డు విస్తరణ,సెంట్రల్ లైటింగ్స్,వైట్ లైన్స్ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు నుండి జీఎం ఆఫీస్ వరకు రోడ్ వన్ సైడ్ స్ట్రీట్ లైట్స్,వైట్ లైన్స్, పరుశురాం నగర్ నుండి రైల్వే ట్రాక్ తిలక్ నగర్ వరకు రోడ్డు విస్తరణ చేయాలన్నారు.జవహార్లాల్ నెహ్రు స్టేడియంలో ఓపెన్ జిమ్,సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలనీ,ఈసిఓ పార్క్,ధర్మశాస్త్ర పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటూ చేయాలన్నారు.సింగరేణి ఆర్ జి-1సెక్టర్ -2 కార్మిక వాడల్లో ఇంటర్నల్ రోడ్స్ వేయాలని,ఆర్ వో ప్లాంట్స్ (10) సింగరేణి ద్వారా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని అవకాశం ఉన్న ప్రాంతంలో కమ్యూనిటి హాల్స్ నిర్మాణం రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం సింగరేణి స్థలాలలోసీనియర్ సిటిజన్ హాల్స్ నిర్మాణం స్మశాన వాటిక కోసం పాత బిటిసి ప్రక్కన ఉన్న స్థలాన్ని కేటాయించి అభివృద్ధి పనులు చేయించాలి సూచించారు. గోదావరి ప్రక్కన స్మశాన వాటికను సింగరేణి అభివృద్ధి చేయాలని,సెక్టర్ -2 ఎల్బీ నగర్ నుండి రమేష్ నగర్ వరకు సింగరేణి పైప్ లికేజిలను వెంటనే అరికట్టాలన్నారు.సెక్టర్ -2 లో ఉన్న పురాతనమైన పైప్ లైన్స్ నీ మార్చాలని,తిలకనగర్ సూపర్ బజార్ సమీపంలో ఉపయోగంలో పాత సబ్జెస్టేషన్ సీనియర్ సిటిజన్ హాల్ గా మార్చాలని,తిలక్ నగర్ డౌన్ లోని అభినవజ్యోతి స్కూల్ నుండి సింగరేణి క్వాటర్స్ లో కోల్ వాషరీస్ మీదుగా విఠల్ నగర్ పోస్ట్ ఆఫీసును ప్రధాన రహదారి ని కలిపే రోడ్ నిర్మాణం చేయాలన్నారు.రమేష్ నగర్ నుండి విఠల్ నగర్ పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ నిర్మాణం చేయాలి.వైట్ లైన్స్ వేస్తూ రెండు వైపుల స్ట్రీట్ లైట్స్ వేయాలి,ఉపయోగం లేని హెచ్ టి లైన్స్ తీసి వేయాలి.జవహర్ నగర్ కనకదుర్గ ఆలయం నుండి స్టేడియం మీదుగా 5 ఇంక్లైన్ ప్రధాన రహదారిని కలిపే రోడ్డును నిర్మాణం చేయాలని వైట్ లైన్స్,రోడ్డుకు ఇరువైపుల స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు.లక్ష్మినగర్,కళ్యాణ్నగర్,అడ్డగుంటపల్లి వెళ్లే వరకు రోడ్ల నిర్మాణం,మేదరిబస్తి నుండి ఎల్ బి నగర్ వరకు రోడ్డు నిర్మాణంతో పాటు వైట్ లైన్స్, రమేష్ నగర్ నుండి కళ్యాణ్ నగర్ వరకు రోడ్డు మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నెం.1 కల్లు డిపో నుండి గౌతమినగర్ సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు. గౌతమి నగర్ రైల్వే ట్రాక్ నుండి ఎన్టిపిసి రింగ్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్స్ ను డెకరేట్ చేయాలి.జంక్షన్ ఇంఫ్రుమెంట్స్ తిలక్ నగర్, రమేష్ నగర్,గౌతమి నగర్,మేడిపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందు ఇంకా కొన్ని ప్రధాన కూడల్లలో చేపట్టాలన్నారు.డిజటల్ లైబ్రరిస్ ఏర్పాటు చేయాలి అభినవ జ్యోతి స్కూల్ నుండి గౌతమి నగర్ రోడ్ వరకు నిర్మాణం చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు,మున్సిపల్ సింగరేణి,విధ్యుత్అధికారులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :