అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మార్చి 05 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని పోత్కపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం మహిళా మృతి 9 సంవత్సరాల అబ్బాయికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం హాస్పటల్ తరలింపు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన శ్రీమంతుల భాగ్యమ్మ వయసు 55 తన మనవడు హర్షవర్ధన్ వయసు 9 సంవత్సరాలు ఉదయం 11 గంటల సమయంలో బెల్లంపల్లికి చుట్టాల ఇంటికి పోయే తరుణంలో పోత్కాపల్లి రైల్వే స్టేషన్లో సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కే సమయంలో కాలుజారి రైలు కింద పడటం తోటి అది చూసిన ముందే రైలు ఎక్కిన అబ్బాయి అయోమయానికి గురై వెంటనే రైలు నుండి కిందికి దునకడంతోటి తీవ్ర గాయాలయ్యాయని వెంటనే స్థానికులు అబ్బాయిని కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారని భాగ్యమ్మ అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందిందని తెలియజేశారు వెంటనే రైల్వే పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు
.
Aksharam Telugu Daily