అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగుండం : రామగుండం మండల ప్రతినిధి పెద్దపల్లి మార్చ్ 3 అక్షరం న్యూస్-: ఆయన మరణించినా... చూపు మాత్రం బ్రతికే ఉంది. నేత్రదానంతో మరో ఇద్దరి దేహంలో సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి.పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తమ్ముడు ఠాకూర్ శైలేందర్ సింగ్ (47) శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు.రామగుండంకు చెందిన శైలేందర్ సింగ్ ప్రస్తుతం గోదావరిఖనిలోని శారదనగర్ లో ఉంటున్నారు.శైలేందర్ అకాల మరణం తో విషాదంలో ఉన్న కుటుంబం,సమాజ హితం కోసం మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి ఆయన నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు.సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి,కే.ఎస్.వాసు ఆధ్వర్యంలో టెక్నీషియన్ ఆరిఫ్ ద్వారా నేత్రాలను సేకరించి,హైదరాబాద్ లోని వాసన్ ఐ బ్యాంక్ కు తరలించారు.కుటుంబ సభ్యుడు ను కోల్పోయిన దుఃఖంలో కూడా నేత్రదానం చేయ డానికి ముందుకు వచ్చిన నేత్రదాత భార్య ఠాకూర్ సరోజ్,కూతుళ్ళు తనిషా,అనేక,సోదరులు,వదినలు ఠాకూర్ అయోధ్య సింగ్,హేమలత,రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్,మనాలి,ఠాకూర్ ధర్మేంధర్ సింగ్,ఉమ, సోదరీమణులు సునీత,విమలను రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు,పలువురు సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రావణ్ కుమార్,లింగమూర్తి,ప్రతినిధులు రాజమౌళి,వాసు,భీష్మాచారి,లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్,మల్లికార్జున్,ప్రతినిధి బెణి గోపాల్ త్రివేదితో పాటు పలు రాజకీయ,కార్మిక సంఘాల నాయకులు అభినందించారు.
.
Aksharam Telugu Daily