అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా క్రైమ్/ కమిషనరేట్ / అక్షరం న్యూస్ : అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ, విధుల పట్ల అలసత్వం వహించిన 8 మంది పోలీస్ కానిస్టేబుళ్లను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్ పి కి అటాచ్ చేసిన సీపీ ఏ .వి.రంగనాద్ ఆరోపణల కారణంగా కానిస్టేబుల్ లను అటాచ్ చేయలేదు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుల్లపై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేదు... గతంలో కొద్ది మంది మహిళా కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్ కు బదిలీ కావడంతో వారి స్థానంలో ప్రస్తుతం వెలుబడిన ఉత్తర్వుల మేరకు ఎనిమిది మంది కానిస్టేబుల్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకానీ అటాచ్ కాబడిన సదరు కానిస్టేబుళ్లను ఆరోపణలపై అటాచ్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మీడియా మిత్రులు గమనించగలరు.
.
Aksharam Telugu Daily