Sunday, 02 April 2023 12:57:16 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

శిధిలావస్థ లో తహసిల్దార్ కార్యాలయం

వెంటనే నూతన భవనం నిర్మించాలి: సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను.

Date : 15 October 2022 07:00 PM Views : 395

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తిరుమలాయపాలెం/అక్టోబర్15/ అక్షరం న్యూస్:-తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం పై కప్పు పెచ్చులు పెచ్చులుగా ఉడుతూ ఇనుప కడ్డీలు బయటకు వచ్చి ఏ క్షణంలో భవనం కూలుతుందని భయంతో అధికారులు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని దాని స్థానంలో నూతన భవనం నిర్మాణం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అన్నారు. తహసిల్దార్ కార్యాలయం శనివారం సిపిఎం బృందం సందర్శించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడం కోసం 2000 సంవత్సరంలో ఎమ్మార్వో కార్యాలయం నిర్మించడం జరిగిందని నిర్మాణ కాంట్రాక్టర్ సరైన నాణ్యత పాటించకపోవడం వల్ల బిల్డింగ్ అంత పెచ్చలు పెచ్చలుగా ఊడుతూ ప్రజల పైన పడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన భవనం కురవడం వలన విలువైన డాక్యుమెంట్స్,కంప్యూటర్ సామాగ్రి మొత్తం కూడా తడిసిపోతున్నాయని అలాగే అవసరాలకు వచ్చిన ప్రజలు కూడా చినుకులకు తడవలసిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. మండల కేంద్రమైనటువంటి తహసిల్దార్ కార్యాలయం ను అధికారులు కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన శిధిలావస్థకు వచ్చిందని ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి కూలిపోయే దశలో ఉన్న తహసిల్దార్ కార్యాలయం స్థానంలో కొత్త భవన నిర్మించి ప్రజలకు, కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు రక్షణ కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ప్రభుత్వం డిమాండ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించాలని లేనియెడల పెద్ద ఎత్తున ప్రజలందరిని సమీకరించి ఉద్యమం నిర్మించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కొల్చల స్వామి నిర్సుల వెంకటేశు మద్దినేని శ్రీనివాస్ ఇప్పుల పుష్పావతి బి రాములు కొమ్ము నాగేశ్వరరావు కే ఉప్పలయ్య కె వెంకన్న కోటయ్య వల్లపు కోటయ్య పీలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు