అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా క్రైమ్ /కాశీబుగ్గ అక్షరం న్యూస్ : రవాణా చేస్తున్న ఇద్దరిని హన్మకొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి సాయిరాం, తూము విజయ్ ఇద్దరూ స్నేహితులు గత ఏడాది నుంచి గంజాయి తాగడం, అమ్మడం అలవాటుచేసుకున్నారు. ఈక్రమంలోనే ఒడిషా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ కాశీబుగ్గలో విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల నుంచి 3 కేజీల పొడి గంజాయి, 2 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ డాక్టర్ ఎం జితేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసరావు, ఎంఎ నిస్సార్‌పాషా, వీ లవకుమార్, ఎస్సైలు , టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily