Sunday, 02 April 2023 02:45:33 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

కొండను తవ్వేసి... అడవిని మింగేసి

.

Date : 01 March 2023 08:17 PM Views : 724

అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / వరంగల్/నెక్కొండ : - అనుమతులు లేవు..గుట్టుగా గుట్టలపై తవ్వకాలు - ధన దాహానికి ప్రకృతిని బలి చేస్తారా..? - బి.టి రోడ్ల నిర్మాణం పేరుతో అక్రమ మట్టి దందా.. - నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికార యంత్రాంగం.. వరంగల్ జిల్లా/నెక్కొండ/మర్చి 01(అక్షరం న్యూస్):- ప్రకృతి సంపదకు ఆనవాళ్లు గుట్టలు ప్రకృతి రమణీయతకు పచ్చదనాలను తన ఒడిలో బంధించుకొని ఆహ్లాదం పంచేవి గుట్టలు వందల ఏళ్ల నుంచి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉంటూ స్థానికతకు నిలువుటద్దంగా నిలుస్తున్న గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి..రాత్రి పగలు తేడా లేకుండా కళ్ళముందే దర్జాగా సాగుతున్న మట్టి దందా అక్రమార్కులకు కాసులు కురిపిస్తుండగా ప్రకృతి సంపద రోజురోజుకు కరిగిపోతుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం లోని రెడ్లవాడ గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న రక్మితండాలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు గుట్టలన్నీ ఆనవాళ్లు లేకుండా కనుమరుగు అవుతున్నాయి. అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడంతో అక్రమార్కులకు గుట్టలు కాసులు కురిపిస్తుండగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. మట్టి తవ్వకాల కోసం ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి ఆ తరువాతే మైనింగ్ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేయాలి. ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తీసుకోవాలి. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు మట్టి తీయొచ్చు అన్నది హద్దులు నిర్ణయించాలి. సర్వే నెంబర్ల ఆధారంగా హద్దులు నిర్ణయించాలి. లీజు గడువు ముగిసిన తర్వాత తవ్వకాలు నిలిపివేయాలి. కానీ ఎక్కడ ఈ నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడో ఓ సర్వే నెంబర్? లో తవ్వకాలు అనుమతి తీసుకుంటున్న మట్టి వ్యాపారులు ముందు అనుమతి లేని ప్రాంతాల్లో మట్టిని తోడిస్తున్నారు. ఆ తర్వాత నింపాదిగా అనుమతి తీసుకున్న ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా యంత్రాలతో గుట్టలను తొలిచేస్తున్నారు. గుట్టను మొత్తం గుల్లగుల్ల చేస్తున్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తూ సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు అమ్మకాలు కళ్ళెదుటే సాగుతున్న ఎవరికి పట్టడం లేదని మండల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. సొంత పట్టా కలిగిన భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాటిని బేకతారు చేస్తూ మట్టి దందాకు అలవాటు పడిన కాంట్రాక్టర్లు అనుమతులు లేకుండా యదేచ్చగా మట్టిని గుట్టలకు పెట్టి దళరులతో తొవ్విస్తూ పర్యావరణాన్ని కాపాడకుండా అడవుల్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర ముప్పెనని పకృతి ప్రియులు హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికిఏ స్థాయిలో గండి కొడుతున్నారో దృష్టి సారించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. జిల్లా స్థాయి అధికారులు స్పందించి మట్టి మాఫియాకు చెక్ పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :