అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / : (అక్షరం న్యూస్) ఫిబ్రవరి 27 నిమ్స్ లో ఐదు రోజులుగా మృతువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం రోజు కన్నుమూశారు. నిమ్స్ లో చేరినప్పటి నుండి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె 9.10 గంటలకు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు కాగా ,బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఈనెల 22న హానికర ఇంజక్షన్ తీసుకొని బలవన్మరణానికి యత్నించారు అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వరంగల్ ఎంజీఎం లో చికిత్స అందించారు అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ కు తీసుకొచ్చారు అనంతరం ఎక్మో యంత్రంపై చికిత్స అందించారు ఆమెను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదని మెడికల్ సుపరింటెండెంటట్ నిమ్స్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ప్రకటించారు
.
Aksharam Telugu Daily