Sunday, 02 April 2023 01:05:12 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

వైద్యంలో నిర్లక్ష్యం.. ఆరేళ్లుగా నరకయాతనకు కారణమైన వైద్యురాలు పై క్రిమినల్ కేస్ నమోదు చేయాలి.

.

Date : 25 February 2023 06:03 PM Views : 311

అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / పెద్దపల్లి/గోదావరిఖని : కడుపులో కత్తెర మర్చిపోయిన వైద్యురాలి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేసి ఆస్పత్రిని సీజ్ చేయాలి. వైద్యురాలి పై జిల్లా రాష్ట్ర వైద్య సంచాలకులు కు ఫిర్యాదు చేసిన సిపిఐ నాయకులు మద్దెల దినేష్. మెడికల్ మాఫియాను అరికట్టాలి. మద్దెల దినేష్. గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఫిబ్రవరి 25/అక్షరం న్యూస్: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ మాఫియా రోజు రోజుకు పెట్రేగిపోతుందని కొంతమంది ప్రముఖులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము చెప్పిందే వేదం మేము చేసేదే శాసనం అంటూ చెలరేగిపోతున్నారని సిపిఐ రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రాంతంలోని మార్కండేయ కాలనీ లోని ఒక ప్రయివేట్ జెమిని ఆస్పత్రి నిర్వహిస్తున్న సీనియర్ వైద్యురాలు దగ్గరికి గతంలో ఒక మహిళ పురిటి నొప్పులతో వచ్చి సర్జరీ చేసుకుని సంతోషంగా వెళ్ళింది కానీ,అసలు సమస్య మూడు నెలల తర్వాత మొదలైందన్నారు. కడుపులో నొప్పి విపరీతంగా రావడంతో ఆపరేషన్ చేసిన వైద్యురాలి దగ్గరికి వచ్చి విషయం చెప్పుకుంటే అంత బాగానే ఉంది అని మందులు ఇచ్చిపంపించారు ఐనప్పటికిని కడుపులో నొప్పి తగ్గకపోయేసరికి ఇతర ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసుకున్నారని పేర్కొన్నారు.చివరికి హైదారాబాద్ లోని ఒకఆస్పత్రిలో వైద్యం చేయించుకొని స్కానింగ్ పరీక్షలు చేసుకుంటే కడుపులో కత్తెర ఉందని అసలు విషయం బయట పడడంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు.ఇలాంటి వైద్యం చేసే వైద్యుల పట్ల సంబందించిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతు ప్రజల ప్రాణా లతో వారు చెలగాటమాడుతున్నారని,రోగుల ప్రాణా లు గాల్లో కలుస్తున్నాయని,వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వైద్యురాలు అట్టి మహిళ కడుపులో కత్తెర ను పెట్టి కుట్లు వేసి చేతులు దులుపుకోవడంతో సదురు మహిళకు మరల సంతానం లేకుండా పోయిందని,వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితులు ఏర్పడిందని కావున జిల్లా వైద్యాధికారి, రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు,వైద్య శాఖ మంత్రి కి ఫిర్యాదు చేశామని,గోదావరిఖనిలో నిర్వహిస్తున్న జెమిని ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేసి,ఆస్పత్రిని సీజ్ చేయాలని,నిర్లక్ష్య వైద్యం చేసిన వైద్యురాలు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా,రాష్ట్ర వైద్య శాఖ అధికారులను సిపిఐ నగర సమితి పక్షాన డిమాండ్ చేశారు.లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఖనిలో కొంతమంది వైద్యులు నిర్లక్ష్య వైద్యం చేయడం లేదా క్రింది సిబ్బంది వైద్యం చేయించడం రోగుల ప్రాణాలు పోవడం అలవాటుగా మారిందని తదనంతరం ఒక మెడికల్ మాఫియా రావడం బెదిరించడం లేదా ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారిందన్నారు.నిర్లక్ష్య వైద్యం చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయకుంటే ఇక ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :