Sunday, 02 April 2023 01:19:25 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

నిబంధనలకు విరుద్ధంగా చేస్తవా... చస్తవా..?

.

Date : 24 February 2023 07:18 PM Views : 1416

అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / మహబూబాబాద్/కేసముద్రం : - ఓ పంచాయతీ కార్యదర్శికి వేదింపులు.... - చేయలేని పనులను బలవంతంగా చేయిస్తున్న ఓ ప్రజాప్రతినిధి.... - మండలంలో చర్చనీయాంశంగా మారిన ఓ లీడర్ వ్యవహారం... - నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయాలంటూ ఓ కార్యదర్శిపై ఒత్తిడి... మహబూబాబాద్/కేసముద్రం/ఫిబ్రవరి 24/అక్షరం న్యూస్:-ఆ మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శికి మండల కేంద్రంలోని ఓ ప్రజాప్రతినిధి వేధింపులు ఎక్కవైయ్యాయి.ఆ ప్రజాప్రతినిధికి రూల్స్ ఏం గిట్టవట,కావాలనుకున్న పని ఎంతదైనా సరే..ఆ సెక్రటరీ చేయాల్సిందేనట.. ప్రజా ప్రతినిధి ఆగడాలు తాలలేక ఆ పంచాయతీ కార్యదర్శి తీవ్రమనోవేదనకు గురవుతున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలో చోటుచేసుకుంది.ఓ పంచాయతీ సెక్రటరీని మండల పరిధిలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలోని అధికార పార్టీకి చెందిన ఓప్రజాప్రతినిధి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండని విశ్వసనీయ సమాచారం.కార్యదర్శి విధులకు ఆటంకం కలిగించడమే కాక.. ఒత్తిళ్లకు గురి చేస్తుండు.దీంతో ఆ పంచాయతీ కార్యదర్శి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు.అధికార పార్టీ అండతో ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గురి చేయడం స్థానిక ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది.కార్యదర్శి పరిధిలోకి రాని పనులను కూడా తానే చేయాల్సిందిగా ఒత్తిడి తేవడం,పంచాయతీ పరిధిలోకి రాని కొన్ని పనులకు అక్రమంగా అనుమతులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం,అర్హత కానీ వారికి ప్రభుత్వ పథకాలు లబ్ది చేకూరాలని ఒత్తిడి తీసుకురావడం వంటి పనులకు దిగుతున్నారు.దీంతో కేసముద్రం పరిధిలోని అనేక మంది పంచాయతీ కార్యదర్శులు ఈ తరహా మనోవేదనకు గురవుతున్నారు.ఆ లీడర్ కు కావాల్సిన పనిపై అధికారుల నుంచి ఒత్తిడిని తీసుకొచ్చి మరి చేయిస్తున్నారు.లేక పోతే.. నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. చేస్తావా చస్తావా అన్న చందంగా ప్రస్తుత కేసముద్రం పరిధిలోని పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మారింది.ఒకటి కాదు రెండు కాదు అనేక పనుల్లో ఈ తరహా ఒత్తిడులే చేస్తున్నారని తెలుస్తోంది.దీంతో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. అక్షరం పత్రిక వేదికగా తమ గోడును వెల్లబోసుకున్నారు.కేసముద్రం పరిధిలోని అనేక మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. బలవంతంగా ఎంబీ రికార్డు చేయించి మరి.. అడ్డదారుల్లో బిల్లులు మంజూరు చేయిస్తున్నారనే విమర్శలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.దీంతో.. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మా ఉద్యోగాలకు ఎక్కడ గండం ఏర్పడుతుందా అని ఆయా పంచాయతీల కార్యదర్శులు మనోవేదనకు గురవుతున్నారు.అటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేక,ఇటు లీడర్ల ఒత్తిళ్లను ఎదుర్కోలేక ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు ఇబ్బందులు పడుతున్నారు.ఇకనైనా అధికార పార్టీ నేతలు వారి అధికార అహాన్ని చిన్న ఉద్యోగులపై ప్రదర్శించకూడదని,జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు.. పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రజాప్రతినిధులపై విచారణ చేపట్టి తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఇప్పటికైనా ఆ ప్రజాప్రతినిధి తన తీరును మార్చుకుంటాడా లేదా వేచి చూడాల్సిందే మరి....

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :