అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : 2లక్షల రూపాయల నగదును మత పెద్దలకు అందజేసిన మంత్రి అజయ్.. హర్షం వ్యక్తం చేసిన ముస్లిం మైనారిటీ నాయకులు.. ఖమ్మం/ తల్లాడ ఫిబ్రవరి 24 (అక్షరంన్యూస్) ఖమ్మం జామా మసీదును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ మత పెద్దలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పలు సమస్యలపై నివేదించారు. తక్షణమే స్పందించిన మంత్రి అజయ్ కుమార్ మస్జిద్ అభివృద్ధి కోసం పువ్వాడ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయల నగదును తన క్యాంపు కార్యాలయం నందు మత పెద్దలకు అందజేశారు. అదేవిధంగా మస్జీద్ ప్రహరీ గోడ నిర్మాణానికి అంచనా వ్యయం వేసి ఇవ్వాలని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. తమ మస్జీద్ అభివృద్ధి కోసం తక్షణమే స్పందించి 2 లక్షలు ఇచ్చిన మంత్రి అజయ్ కుమార్ కి జామా మస్జీద్ మత పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జామా మస్జీద్ మత పెద్దలు ఇమామ్ సాబ్ అజీజ్, అబ్దుల్ ముబీన్, మహమూద్ ఆశ్రిఫ్, తాజుద్దీన్, ముక్తర్, ఇస్సాక్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily