అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : 33 వ జాతీయ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. (గోదావరిఖని ప్రతినిధి)న్యూఢిల్లీ/తలుకోతర/ఇండోర్ స్టేడియం/ఫిబ్రవరి 23/అక్షరం న్యూస్: ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు డా జీ సంజీవ రెడ్డి అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీ తలుకోతరా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐ ఎన్ టి యు సి 33 వ జాతీయ ప్లీనరీ సమావేశం 2వ రోజు సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జె బి సి సి ఐ సమావేశాలలో ఐఎన్టియుసి పాల్గొనకుండా బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని అన్నారు. అయిన కాని కలకత్తా హై కోర్టు తీర్పు వల్ల జేబీసీసీఐ వేజ్ బోర్డు సమావేశాలలో ఐఎన్టియుసిపాల్గొంటుందని దాని కోసం కృషి చేసిన సంజీవ రెడ్డి,ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనూప్ సింగ్,సెక్రెటరీ జనరల్ ఎస్క్యూ జామ కి జనక్ ప్రసాద్ ధన్యాదములు తెలిపారు. అనంతరం మోడీ వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడూ మన దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ 1925 లో ఏర్పడిందని1930లో మహాత్మా గాంధి చేపట్టిన ఉప్పు సత్యగ్రహంలో యావత్ భారత ప్రజలు పాల్గొంటే ఆర్ఎస్ఎస్ లీడర్ హెగ్డే ఉప్పు సత్య గ్రహంలో పాల్గొనమని చెప్పారని ఆ తర్వాత జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనలేదు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీ గారి ను హతమార్చారని. ఇప్పుడు దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని దీనికి ఎదుర్కోవడానికి అన్ని జాతీయ సంఘాలు ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ రాయ్ పూర్ లో నిర్వహించే ప్లీనరీ సమావేశంలో ఐ ఎన్ టి యు సి కి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక రెవల్యూషన్ తేవాలని జనక్ ప్రసాద్ కోరారు. కార్మికుల కోసం సంజీవ రెడ్డి నాయకత్వములో ఐ ఎన్ టి యు సి ఎల్లపుడూ పోరాడుతుందని తెలిపారు. అనంతరం జరిగిన జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల్లో డా జీ సంజీవ రెడ్డి మరో సారి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జాతీయ కార్యదర్శి గా జనక్ ప్రసాద్ ఎన్నికయ్యారు.
.
Aksharam Telugu Daily