అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / వరంగల్/నెక్కొండ : - ప్రయానికులపై ప్రభావం.. పట్టించుకోని అధికారులు,ప్రజా ప్రతినిధులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు... నెక్కొండ, ఫిబ్రవరి 22,(అక్షరం న్యూస్):- మండల కేంద్రం నుండి గుండ్రపల్లి, పెద్దకొర్పొల్ గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారి పైన పాత సిసి రోడ్డును తొలగించి కొత్త సీసీ రోడ్డుకు పనులు ప్రారంభించి కంకర పోశారు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే వాటర్ క్యూరింగ్ కోసం కాంట్రాక్టర్ రోడ్డుపై ఏర్పాటు చేసిన మట్టిని, డస్ట్ ని తూతూ మంత్రంగా పైపైన పోసి వాటర్ కొట్టకుండా వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా మట్టి రోడ్డు పైనే ఉండిపోయి నిరంతరం వాహనాలు తిరిగే ప్రాంతం కాబట్టి వచ్చి పోయే భారీ వాహనాలతో విపరీతంగా దుమ్ము లేస్తుంది.. దుమ్మే కదా అని తేలిగ్గా తీసి పారేయలేం.. ఆ రహదారి మీదుగా టు విల్లర్ పై వెళ్లే ప్రయాణికుల కు మరియు రహదారి పక్కన భూమి ఉన్న రైతుల ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. డస్ట్ ఎలర్జీ తో బాధపడుతున్నామని దుమ్ము కంట్లో పడి యాక్సిడెంట్లు అవుతున్నాయని మాకు ప్రమాదం జరుగుతే బాధ్యులు ఎవరు..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు,లారీలు, ఈ దారి గుండానే వెళ్లడంతో దుమ్ము లేచి వెనుక వచ్చే చిన్న వాహనదారులపై పడడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు. డస్ట్ కూడా మొత్తం పోయకుండా సగం సగం పోసి సగం కంకరతో వదిలేయడంతో వచ్చి పోయే వాహనాలు కంకరపై నుండి జారి కిందపడి హాస్పిటల్ పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ కంకర రోడ్డు మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily