అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / హనుమకొండ / ఆత్మకూరు మండలం : హన్మకొండ జిల్లా /క్రైమ్ /ఆత్మకూరు మండలం /అక్షరం న్యూస్ :కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్రామ ఉప సర్పంచ్ సహా నలుగురు. ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ చమరియు ఆత్మకూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేసారు. వీరి నుండి పోలీసులు 34లక్షల రూపాయల విలువగల 170 కిలోల గంజాయి ఒక కారు, గంజాయి రవాణాకు వినియోగించిన ఒక బోలెరో సరుకు రవాణా వాహనం, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. రాయినేని శంకర్ 41, గొరుకొత్తపల్లి, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా, 2. ముసిక లక్ష్మణ్ 44, నీరుకుళ్లు గ్రామం, ఆత్మకూర్ మండలం, వరంగల్ జిల్లా, 3. మాట మహేష్ 28, బండారుపల్లి గ్రామం,ములుగు జిల్లా, 4. గండికోట సతీష్ 38, పస్రా, ములుగు జిల్లాకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది.ఈ అరెస్ట్కు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి పి.కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకుగాను ఆంధ్రరాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగం నిందితులు మిగితా ఇద్దరు నిందితులతో కల్పి ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నంలోని నూకరాజు (ప్రస్తుతం పరారీలో వున్నాడు) ద్వారా 170కిలోల గంజాయిని కోనుగోలు చేసి దానిని రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపర్చి వరంగలకు తరలించారు. ఈ గంజాయిని వరంగల్ తరలించే క్రమంలో ప్రధాన నిందితులు శంకర్, గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరోకారులో గంజాయికి తరలిస్తున్న కారుకు ఎస్కా గా వ్యవహరించేవారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు ఆత్మకూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఈ రోజు నిర్వహించిన తనీఖీల్లో అనుమానస్పదంగా వస్తున్న నిందితులు వాహనాలను అదుపులోకి తీసుకోని తనీఖీ చేయగా బోలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పర్కాల ఏసిపి శివరామయ్య, టాస్క్ఫోర్స్ ఇన్సెస్పెక్టర్లు కె.శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, ఆత్మకూర్ ఇన్సెస్పెక్టర్ బి.కుమార్, టాస్క్ఫోర్స్ ఎస్.ఐలు లవణకుమార్, నిసార్పాషా, హెడాకానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్ళు శ్యామ్, రాజు, బిక్షపతి, సురేష్, శ్రవణ్ నవీన్, కరుణాకర్లను ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.
.
Aksharam Telugu Daily