అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / వరంగల్/సంగెం : వరంగల్ జిల్లా / సంగెం /అక్షరం న్యూస్ :ఫిబ్రవరి 19. మండల కేంద్రంలోని సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడుతూ 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుణ్య ముహూర్తం ఈసారి వచ్చిందని, ఈ మహా శివరాత్రి కి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ రోజున జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాల్లో మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన శ్రీరత్న విద్యాలయం విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను అలంకరించాయని అన్నారు. ముఖ్యంగా సైనికులకు సంబంధించిన నృత్యం పలువురిని ఆకర్షించిందని తెలిపారు. విద్యార్థినిలు చేసిన నృత్యాలు అందరిని ఆనందింపజేశాయని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిలువగానే విద్యార్థిని విద్యార్థులను తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గుడి చైర్మన్ కందకట్ల నరహరి శ్రీరత్న విద్యాలయం కరస్పాండెంట్ ప్రిన్సిపల్ను ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బాబు, ఎంపిటిసి మల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ కోటి, కమిటీ సభ్యులు కోడూరి సదయ్య, పులివీరస్వామి, మోహన్, పరిసర గ్రామాల సర్పంచులు, రవిచంద్ర కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కాసం క్రాంతి కుమార్, విద్యా భారతి ప్రిన్సిపల్ చందర్రావు, వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యా య బృందం తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily