అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / వరంగల్/నెక్కొండ : - ఇటుకల పరిశ్రమలతో పెరుగుతున్న వాయు కాలుష్యం - పట్టించుకోని సంబంధిత అధికారులు నెక్కొండ, ఫిబ్రవరి 16, (అక్షరం న్యూస్):- మండల కేంద్రం నుండి నర్సంపేటకు వెళ్లే ప్రధాన రహదారికి అనుకొని ఉన్న సూరిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఇటుక బట్టీల పరిశ్రమల వలన వాతావరణ కాలుష్యం కావడమే కాకుండా ఇటుకల తయారీలో వాడే బొగ్గు, బూడిద, వరి పొట్టు, రోడ్డుకు పక్కనే పోయడంతో బైకుపై వెళ్లేవారికి ఆటోలలో వెళ్లే వారికి ప్రయాణికులకు సైతం గాలికి వచ్చి కళ్ళల్లో పడడంతో తీవ్ర ఇబ్బంది జరగడంతో పాటు వ్యవసాయ సాగు భూములలో ఈ దుమ్ము పేరుకోవడంతో చుట్టుపక్కల రైతులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇటుక బట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily