Wednesday, 07 June 2023 11:06:34 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

నాగ చైతన్య సినిమాలో విలన్‌గా ప్రముఖ హీరో..!

.

Date : 14 October 2022 01:14 PM Views : 99

అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : నాగ చైతన్య వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్ర‌భు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. బై లింగ్విల్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ పాత్రను చేస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతుంది. వెంకట్ ప్రభు నుంచి వచ్చిన ‘మానాడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. శింబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందువల్ల చైతో తెరకెక్కిస్తున్న సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాలను మించేలా చిత్రం ఉండాలని వెంకట్ ప్రభు భావిస్తున్నాడట. ఈ మూవీలో విలన్ పాత్రలో ప్రముఖ హీరోని నటింప చేయాలని అనుకుంటున్నాడట. విలన్ పాత్రలో హీరో జీవా కనిపించనున్నట్టు సమాచారం. మేకర్స్ అతడితో సంప్రదింపులు జరపగా అంగీరించాడని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023, ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక నాగ చైతన్య కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘థాంక్యూ’ లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ లో అతిథి పాత్రను పోషించాడు. ఈ మూవీ కూడా అతడికి నిరాశనే మిగిల్చింది.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :