అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ ఫిబ్రవరి 9(అక్షరం న్యూస్) నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ బస్ స్టాప్ ఎదురుగా శ్రీ లలితా సహస్ర నామ సేవా సమితి నాగర్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో పదవ వార్షిక శ్రీశైలం పాదచార శివ స్వాములకు అన్నప్రసాద, పండ్లు, ఫలహారాలు పంపిణీ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షురాలు కొత్త రేవతి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివదీక్ష స్వికరించిన ఈప్రాంత శివ స్వాములు, మరియు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కాలినడకన వెళ్లే శివ స్వాములు, వారి వెంట కాలినడకన శ్రీశైలం వెళుతున్న భక్తులకు నేటి నుండి శివరాత్రి వరకు ప్రతిరోజు ఉదయం సమయంలో పండ్లు, మధ్యాహ్నం అన్న ప్రసాదం, సాయంత్రం వేళలో పండ్లు, అల్పాహార పంపిణీ,త్రాగునీటి పంపిణీ ప్రత్యేకంగా వేసిన టెంట్ శిబిరంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సాయంత్రం వేళలో శ్రీ లలితా సహస్రనామ కమిటీ మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రదోషకాల సమయంలో శివ స్వాములచే ప్రత్యేక భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో శివ స్వాములకు అలంకరణ నిమిత్తం విభూతి, గంధం, కుంకుమ అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాంతంలోని శివ స్వాములు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆమె కోరారు.
.
Aksharam Telugu Daily