అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / పెద్దపల్లి : సుల్తానాబాద్,( పెద్దపల్లి జిల్లా) ఫిబ్రవరి 6, అక్షరం న్యూస్ సుల్తానాబాద్ పట్టణం లో ఘోర ప్రమాదం జరిగింది.ఒకే కుటుంభానికి చెందిన ఐదుగురు సభ్యులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సోమవారం రోజు గ్రానైట్ బండ తీసుకుని వెళ్తున్న లారీ నించి పెద్ద బండ రాయి రోడ్డు పక్కనున్న ఇంటి పై పడింది, డ్రైవర్ బ్రేక్ వేయడం తో అదుపు తప్పి బండ రాయి లారీ పై నించి కిందపడి దొర్లడం తో రోడ్డు పక్కనున్న ఇంటి గోడ కూలి పోయింది, అదృష్ట వశాత్తూ ఇంట్లో నిద్రిస్తున్న దక్షిణ ముార్తి కుటుంబం ప్రమాదం నించి బయట పడ్డారు. ఉదయం 4గంటల ప్రాంతం లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ రోడ్డు పై ఇసుక లారీ లు, గ్రానైట్ బండ లు సరఫరా నిరంతరం సాగుతూనే ఉంది.ఈ రోడ్డు గురించీ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఎన్నో సార్లు అధికారుల దృష్టి కు తీసుకు వెళ్ళినా ఎవరు పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం తో ఉన్నారు.ఈ రోజు జరిగిన ఈ గ్రానైట్ బండ రాయి ప్రమాదం తో ప్రాంత వాసుల నిరసన కట్టలు తెంచుకుంది.అవసరమైన జాగ్రత్తలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న అదికారులతో పాటు కాంట్రాక్టర్ల కు కొమ్ము కాస్తున్న ప్రజా ప్రతినిధుల పని తీరుపై కాంగ్రెస్ నేతలు జెడ్.పీ.టి.సి. మినుపాల స్వరూప ప్రకాష్ రావు, సాయిరి మహేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. చిన్న చిన్న చెక్క ముక్కలపై క్వింటాల్ల బరువైన గ్రానైట్ రాళ్ళను లారీలతో అజాగ్రత్తగా రవాణా చేస్తున్న అధికారులు మాముాళ్ళ మత్తులో పట్టించుకోకుండా విడిచిపెట్టడం దారుణమని, సామాజిక కార్యకర్త హకీమ్ వాపోయారు. ప్రమాదం జరిగితే చర్యలు తీసుకుంటామని అబద్ద హామి లతో బాధితులను మొసలి కన్నీరు కార్చి ఓదార్చే నాయకులు ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునారవృత్తం కాకుండా పకడ్బంది చర్యలు తీసుకొవాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily