అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి/ కరీంనగర్ ,జనవరి 27( అక్షరం న్యూస్) కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు దీకొండ జయ -- కుమారస్వామి దంపతుల కుమారుడు సహర్ష్ ల అక్షరాభ్యాసంను గురువారం రోజున గతంలో గురువుగా పనిచేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చే బురుగుపెల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అక్షరాభ్యాసం చేయించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడొచ్చు తనమీద గౌరవంతో వసంత పంచమి రోజున తన కుమారునికి అక్షరాభ్యాసం చేయించిన దికొండ కుమారస్వామి కుమారుడు భవిష్యత్తులో మంచిగా చదువుకుని విద్యలో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
Aksharam Telugu Daily