అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / పెద్దపల్లి : __గంజాయి అమ్మే ఇద్దరు నిందితులను పట్టుకొన్న పెద్దపల్లి పోలీసులు పెద్దపల్లి రూరల్ జనవరి 24 అక్షరం న్యూస్ • పరారి లో మరొక నిందితుడు. • 800 గ్రాముల గంజాయి స్వాధీనం దాని విలువ సుమారు 32,000 రూపాయలు మరియు రెండు సెల్ ఫోనులు పెద్దపల్లి మండలం, చీకురాయి రోడ్ లో నమ్మదగిన సమాచారం పై, ఇద్దరు యువకులు గంజాయి అమ్మడానికి సిద్ధంగా ఉండగా, వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద ప్యాకెట్ లలో గంజాయి లభించడం జరిగింది. వెంటనే వాళ్ళని విచారించగా వారి పేర్లు షేక్ నాగూర్ పాషా, సుభాష్ నగర్, MD మహబూబ్ S/O అబ్దుల్ రజాక్, సయ్యద్ నబి కాలనీ, పెద్దపల్లి అని గంజాయి కి బానిసలుగా మారి అయిలాపురం రఘుపతి, సుభాష్ నగర్, పెద్దపల్లి వద్ద గంజాయి కొని తాగేవాళ్ళం అని జల్సాలకు డబ్బులు సరిపోక గంజాయి అమ్మి డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో రఘుపతి వద్ద కొన్న గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరకు పెద్దపల్లి లో కొంతమందికి అమ్మాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకోని నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు లో నిందితులను పట్టుకున్న ఎస్.ఐ రవీందర్, సిబ్బందిని పెద్దపల్లి డి.సి.పి., CH. రూపేష్, I.P.S., గారు అభినందించారు. నిందితుల వివరాలు 1.షేక్ నాగూర్ పాషా s/o వళి, 19yrs, సుభాష్ నగర్, పెద్దపల్లి, 2.MD మహబూబ్ S/O అబ్దుల్ రజాక్,19Yrs, సయ్యద్ నావబి కాలనీ, పెద్దపల్లి . అయిలాపురం రఘుపతి, సుభాష్ నగర్, పెద్దపల్లి(పరారి లో ఉన్నాడు).
.
Aksharam Telugu Daily