అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి(పెద్దపల్లిజిల్లా),జనవరి 9,అక్షరం న్యూస్: తెలంగాణలోని కరీంనగర్లో జిసిఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ లో ఆదివారం నాడు సావిత్రిబాయి పూలే 192 వ జన్మదినోత్సవం సందర్భం గా సేవ పురస్కార ప్రధాన కార్యక్రమం వల్లూరి నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ విఆర్ శ్రీనివాస రాజు అధ్యక్షతన జరిగింది.2022 సంవత్సరంకు గాను గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన ప్రముఖ బ్యూటిషన్, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటిమని,సాయి విజ్ఞాన్ ఫౌండేషన్ డైరెక్టర్ గా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకుగాను లలిత శ్రీ, సావిత్రిబాయి పూలే సేవ పురస్కారం అవార్డు ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ఫిలిం భవన్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో లలితా శ్రీ కి తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ ఓరుగంటి ఆనంద్,జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ వ్యవస్థపకులు,చైర్మన్ వి.ఆర్.శ్రీనివాస్ రాజులు అవార్డు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఫౌండేషన్ నిర్వాహకులు ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు.తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసిన నిర్వాహకులకు లలిత శ్రీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చర్ల స్వరూప రాణి,పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు,సావిత్రిబాయి పూలే సంస్థ నిర్వాహకులు సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily