Sunday, 02 April 2023 12:55:45 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

రాబోయేది కిసాన్‌ సర్కారే : నిజామాబాద్‌లో పంజాబ్‌ స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌

కేంద్రంలో రాబోయేది కిసాన్‌ సర్కారేనని పంజాబ్‌ స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సాంద్వాన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు.

Date : 25 December 2022 06:31 AM Views : 134

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / : హైదరాబాద్‌ : కేంద్రంలో రాబోయేది కిసాన్‌ సర్కారేనని పంజాబ్‌ స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సాంద్వాన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు స్పీకర్‌ కుల్తార్ సింగ్‌ సాంద్వాన్‌, డిప్యూటీ స్పీకర్‌ జై సింగ్, ఎంపీ విక్రమ్‌జిత్‌ సింగ్‌ సహని, ఎమ్మెల్యేలు కుల్వంత్‌ సింగ్‌ పండోరి, అమర్‌ జీత్‌ సింగ్‌ నిజామాబాద్‌ పర్యటనకు రాగా.. ప్రతినిధుల బృందానికి నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుల్తార్‌ సింగ్‌ సాంద్వాన్‌ మాట్లాడారు. పంజాబ్‌లో ఆప్‌ కొత్తగా అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ అభివృద్ధి బాగుందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణలో అమలువుతన్న పథకాలు దేశాన్నే ఆలోచింపజేస్తున్నాయన్నారు. రైతులకు వెన్నుదనున్నగా రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేలు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు కరెంటు ఇస్తున్నారని ప్రశంసించారు. మనం వేసుకునే చెప్పులకు ధర ఉంది కానీ.. కేంద్రం రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముందుచూపుతో నీటి కొరత లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద రూ.1,00,116 ఇవ్వడం హర్షనీయమన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యే గణేశ్ బిగాల తాను ఒకే కాలేజీలో చదువుకున్నామని, వారితో ఉన్న సాన్నిహిత్యంతో నిజామాబాద్‌ నగరానికి వచ్చామన్నారు. నిజామాబాద్ నగరం గణేశ్‌ బిగాల నేతృత్వంలో బాగా అభివృద్ధి చెందిందన్నారు. కలెక్టరేట్‌, ఐటీ హబ్‌లు అద్భుతంగా ఉన్నాయన్నారు. బిగాల గణేశ్‌ ఆతిథ్యం సంతోషాన్ని కలిగించిందన్నారు. కిసాన్ సర్కార్ కోసం పనిచేస్తున్న కేసీఆర్‌కు అందరం మద్దతివ్వాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ నుడ చైర్మన్‌ ప్రభాకర్, బీఆర్‌ఎస్‌ నేతలు తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :