అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / : షర్మిల కేసులో హైకోర్టు స్పష్టీకరణ హైదరాబాద్, డిసెంబర్ 15 (అక్షరం న్యూస్): వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చట్టవిరుద్ధంగా ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. లోటస్‌పాండ్‌లోని ఇంటి వద్ద పోలీసులు బ్యారికేడ్లకు ఏర్పాటుచేసి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ షర్మిల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు. బారికేడ్లను తొలగించాలని, పాదయాత్రకు వెళ్లనివ్వాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదిస్తూ.. వైఎస్ విగ్రహం వద్దకు వెళ్తానని షర్మిల చెప్పి, సీఎం నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ధర్నా చేస్తే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య వచ్చిందన్నారు. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాల్సి వస్తున్నదని చెప్పారు.
.
Aksharam Telugu Daily