అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : ఢిల్లీ : సర్దార్ పటేల్ రోడ్‌లో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి.. కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జాతీయ అధ్యక్షుని ఉచితాసనాన్ని స్వీకరించారు. ఛాంబర్‌లో కూర్చొన్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరిగాయి. మొత్తంగా ఈ యాగాల్లో 12 మంది రుత్వికులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily