అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : నవంబర్ 12 (అక్షరం న్యూస్) ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా కథానాయకుడు అల్లు అర్జున్ ఉత్తరాది ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రూల్) గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నేటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. ఇందులో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, అనసూయ భరద్వాజ్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.
.
Aksharam Telugu Daily