అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా :
ఖమ్మం జిల్లా/ జడ్పి సెంటర్/ డిసెంబర్.06/అక్షరం న్యూస్; రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం మైనార్టీ నాయకులు మరియు సిటీ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జడ్పి సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో , పరస్పర గౌరవంతో పరోపకారం ,కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఖమ్మం నియోజవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహనీయులు ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. వారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిటీ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్ , కార్పొరేటర్ మక్బూల్ , నగర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఇషాక్ , మాజీ కార్పొరేటర్ షొకత్ , పాన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోసిన్, నగర మైనార్టీ నాయకుడు షారుక్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Aksharam Telugu Daily