అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో శివాలయంకు వెళ్లే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా డీ కొట్టుకోవడంతో కూసుమంచి మండలం సంధ్యా తండాకు చెందిన బానోత్ వీరన్న (45)అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. గాయాలు తగిలిన సుమారు గంట వరకు 108వాహనం అందుబాటులో లేకపోవడం అక్కడికి వచ్చిన పోలీసులు సరిగా స్పందించి క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించడానికి సుమారు గంట ఆలస్యం అయ్యిందని అందువల్ల వ్యక్తి మరణానికి అధికారుల నిర్లక్ష్య కారణమని గ్రామస్థులు పోలీసుల మీద ఆందోళనకు దిగారు. అంతే కాక మండల కేంద్రంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడం పై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడవలసిన అంబులెన్సు మరణించాక మృతదేహాన్ని తీసుక వెళ్ళడానికా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
.
Aksharam Telugu Daily