Wednesday, 07 June 2023 11:25:28 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం

ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Date : 25 November 2022 07:09 PM Views : 163

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / : శేరిలింగంపల్లి నవంబర్ 25 అక్షరం ప్రతినిధి గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల ఐటీ హబ్ కు ట్రాఫిక్ సమస్య లేకుండా అత్యధికమైన బ్రిడ్జిలు నిర్మించి, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఓఆర్ఆర్ నుండి శిల్ప లేఔట్ (మైండ్ స్పేస్ )వరకు రూ. 466 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన 4లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ ను తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఛైర్మన్ లు గ్యాదరి బాలమల్లు, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, నగేష్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి , సింధు ఆదర్శ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావు, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న తో కలిసి పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) లో భాగంగాఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిల్పా లే-ఔట్‌ ఫ్లైఓవర్ ను మంత్రివర్యులు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా హైటెక్ సిటీ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు రద్దీ ఉండే ప్రాంతాలలో చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని హంగులతో ,నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టడం జరిగినది అని , రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ తగ్గించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక ప్రాంతాల్లో పూర్తి చేసుకొని రద్దీ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఉద్యోగులు కొరకు చేస్తున్న కృషి త్వరలో ఫలించబడుతుంది అని, అన్ని హంగులతో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో నే ప్రాంభించబడుతుంది అని, ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ఔటర్ రోడ్డు కు వెళ్ళడానికి సులబతరం అవుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, ట్రాఫిక్ తగ్గి ,సమయం , వాహనాల ఇంధనం తగ్గునని,ప్రజలకు కొంత సాంత్వన చేకూరునని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డీపీ) పై హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డీపీ) ,హైదరాబాద్ ను విశ్వనగరం గా తీర్చి దిద్దే క్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ,తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :