అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ నవంబర్ 22- స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ బి అశోక్ సారధ్యంలో గత రెండు రోజులుగా విద్యుత్ దీప కాంతులలో (ఫ్లడ్ లైట్స్ వెలుగులలో) చర్ల మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. క్రీడాభిమానులతో క్రీడా మైదానం కిక్కిరిసిపోయింది. క్రీడాభిమానుల కరతాల ధ్వనుల నడుమ టోర్నమెంట్స్ ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. క్రీడాకారులు నువ్వా నీనా అని హోరాహోరీగా తమ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. క్రీడాభిమానులు కరతాల ధ్వనులతో క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ క్రీడలను ఆస్వాదిస్తున్నారు. ఎస్సైలు రాజు వర్మ వెంకటప్పయ్య వ్యాయామ ఉపాధ్యాయులు పి శ్రీనివాసరావు (పీడి జిహెచ్ఎస్ చర్ల ) ఆలం ఈశ్వర్ ( పిడి ఉంజుపల్లి) పి శ్రీను ( పిఈటి జడ్పీఎస్ఎస్ సత్యనారాయణపురం) ఐ రాజు (పి ఈ టి గురుదేవ్ విద్యాలయం) పి సుధాకర్ ( పిఈటి రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం) పర్యవేక్షణలో టోర్నమెంట్స్ జరుగుతున్నాయి.
.
Aksharam Telugu Daily