అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 18 అక్షరం న్యూస్: ఈనెల 15,16 వ తేదీన కొత్తగూడెం లో జరిగిన సింగరేణి స్థాయి కబడ్డీ పోటీల్లో రామగుండం ఏరియా 1,2 కి ద్వితీయ స్థానము తీసుకొని రావడం ఈ నెల 21,22,23న మహారాష్ట్ర లో జరిగే కోల్ ఇండియా స్థాయి పోటీలకు జీడికే ఓసిపి 5 ఈ పీ ఆపరేటర్ బేబీ శ్రీను మైనింగ్ సర్దార్ సాయికుమార్ ఎంపిక ఆయిన సంధర్భంగా శుక్రవారం సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు,రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్న గోదవరిఖనిలోని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఎమ్మెల్యేకు చందరకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జె వి రాజు,దళిత రత్న అవార్డ్ గ్రహీత ఉద్యమ నాయకులు దేవి లక్ష్మీనర్సయ్య,కెక్కర్ల రాజకుమార్ గౌడ్,మాజీ కార్పొరేటర్ మారుతి,ఫేస్ కంప్యూటర్స్ శ్రీను,తెరాస నాయకులు పాల్గొన్నారు. 15,16 వ తేదీన కొత్తగూడెం లో జరిగిన సింగరేణి స్థాయి పోటీల్లో రామగుండం ఏరియా1,2 కి ద్వితీయ స్థానము తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించి ఈ నెల 21,22,23న మహారాష్ట్ర లోని నాగపూర్ లో జరిగే కోల్ ఇండియా స్థాయి పోటీలకు వెళ్తున్న జీడికే ఓసిపి-5 కి చెందిన ఈ పి ఆపరేటర్ బేబీ శ్రీనివాస్ 20 సార్లు పైగా కోల్ ఇండియాకి,అల్ ఇండియా పబ్లిక్ సెక్టర్ లో ఆడిన అనుభవము ఉన్న సీనియర్ క్రీడాకారుడు,జీడికే 2 ఇంక్లైన్ లో పని చేసే మైనింగ్ సర్దార్ సాయికుమార్ రామగుండం నుండి ఎంపిక కావడం జరిగింది.కచ్చితంగా నాగపూర్ కబడ్డీలో రామగుండంకు షీల్డ్ ప్రథమ బహుమతితీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
.
Aksharam Telugu Daily