అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / వికారాబాద్/ కుల్కచర్ల : 26వ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ క్రికెట్ ఛాంపియన్ గోవా - 2022లో సత్తా చాటిన విజయ్ కుమార్ ఆర్గనైజర్ గురు ద్రోణాచార్య కేల్ కుద్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇండియా వికారాబాద్ జిల్లా,కుల్కచర్ల, నవంబర్ 18 అక్షరం న్యూస్: కుల్కచర్ల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గొల్ల విజయ్ కుమార్ తండ్రి చిన్నయ్య వికారాబాద్ లో ఎస్ ఎస్ కోచింగ్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూ జాతీయ క్రీడల్లో సత్త చాటారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒక పక్కన క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూ తన ప్రతిభను వేరే రాష్ట్రాల్లో కనబరుస్తూ నేషనల్ క్రికెట్ లీగ్స్ స్టార్ ప్లేయర్ గా ఎదగడం గర్వంగా ఉందని అన్నారు. నవంబర్ 13 నుండి 16వ తేదీలలో జరిగిన 26వ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ గోవాలో ముంబై జట్టులో ఆడి మూడు మ్యాచ్ ల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడం గొప్ప విషయం అని కొనియాడారు. మా కుమారుడు విజయ్ మొదటి మ్యాచ్ లో ఢిల్లీతో తలపడగా 18 బంతుల్లో 7 పొర్లు బాది 38 రన్స్ చేస్తూ రాణించాడు. తర్వాత రెండో మ్యాచ్ మధ్యప్రదేశ్ తో తలపడగా 38 బంతుల్లో మూడు సిక్స్ లు,8 పోర్లు కొట్టి 64 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. మూడవ మ్యాచ్ ఢిల్లీతో జరగగా 21 బంతుల్లో 8 పోర్లు ఒక సిక్సర్ తో నలభై తొమ్మిది రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మార్మూల ప్రాంత నివాసి విజయ్ కుమార్ టి20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన టీమును ఛాంపియన్గా నిలబెట్టడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు గ్రామం పెద్దలు,ఎస్ ఎస్ క్రికెట్ కోచింగ్ అకాడమీ వారు అభినందనలు తెలిపారు. విజయ్ అంచలంచాలుగా ఎదుగుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని పలువురు కొనియాడారు.
.
Aksharam Telugu Daily